నేను నేనే!

6 May, 2019 06:16 IST|Sakshi

‘‘సినిమాల్లో మనం కాని పాత్రను పోషించడం బావుంటుంది. మన పాత్రనే మనం పోషించడం ఇంకా క్రేజీగా ఉంటుంది’’ అంటున్నారు కన్నడ భామ సంజన. ‘ముత్తుకుమార’ అనే కన్నడ సినిమాలో సంజన తన రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌లోనే కనిపించనున్నారు. ధనుష్, సంచితా పదుకోన్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సంజన కీలక పాత్ర చేస్తున్నారు. ఈ విషయం గురించి సంజన మాట్లాడుతూ– ‘‘సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ పాత్రలో నేను కనిపిస్తాను. హీరో  ఆశయం నెరవేరడానికి నేను సహాయం చేస్తాను’’ అన్నారు. ప్రస్తుతం సంజన ‘స్వర్ణ ఖడ్గం’ అనే టీవీ సీరియల్, ‘ఐవర్‌’ అనే తమిళ వెబ్‌ సిరీస్, ‘మాతే మాతే’ అనే కన్నడ సినిమాలతో బిజీగా ఉన్నారు.

మరిన్ని వార్తలు