బాలయ్యకు విలన్‌గా బాలీవుడ్‌ హీరో‌!

13 Jul, 2020 11:22 IST|Sakshi

టాలీవుడ్‌లో  హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ ఎంత సూపర్‌  హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్‌తో బాలయ్యకు  మంచి సక్సెస్ అందించిన  బోయపాటి శ్రీను, ఆ తర్వాత కూడా ‘లెజెండ్’ మూవీతో మరో బ్లాక్‌ బాస్టర్‌ను అందించాడు. ఈ సినిమా సింహాకు మించిన సక్సెస్‌ను సాధించింది. 

ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కుతోంది.  బీబీ3 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌కు ఇప్పటికే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య వైట్‌ అండ్‌ వైట్‌ వేసుకొని చెప్పే ఒక పవర్‌ఫుల్‌ డైలాగ్‌ దుమ్ము లేసేసింది. ఇందులో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఒకటి ఫ్యాక్షనిస్ట్ పాత్ర అయితే.. మరోకొటి అఘోరా పాత్ర. మరి ఇంతటి పవర్‌ ఫుల్‌గా  బాలయ్య కనిసిస్తుంటే ఆయనకు ఎదురొడ్డి నిలిచే విలన్‌ కూడా అలానే ఉండాలి కదా... దాని కోసం ఒక బాలీవుడ్‌ హీరోను విలన్‌గా  బోయపాటి ఎంపిక చేసినట్లు తెలిసింది. బాలయ్య సినిమాలో విలన్‌గా బాలీవుడ్‌ హీరో  సంజయ్ దత్‌ను అనుకుంటున్నారు. గతంలో ఈ సినిమా చేయడానికి నో చెప్పినా సంజూ బాబా‌.. తాజాగా ఈ సినిమాలో నటించేందుకు  అంగీకరించినట్లు బోయపాటి కొంత మందితో పంచుకున్నట్లు సమాచారం.

చదవండి: బాలకృష్ణ బీబీ3లో అమలా పాల్‌!

ప్రస్తుతం సంజయ్ దత్.. యశ్ హీరోగా నటిస్తోన్న కేజీఎఫ్ 2‌లో విలన్‌గా నటిస్తున్నాడు. మున్నాభాయ్‌ ఇప్పటి వరకు హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన ‘అగ్నిపథ్’ సినిమాతో పాటు ‘పానిపట్’ సినిమాలో విలన్‌గా విశ్వరూపం చూపించాడు. మొదటి సారి తెలుగులో బాలయ్య సినిమాతో విలన్‌గా కనిపించబోతున్నాడు. కరోనా కారణంగా వాయిదా పడిన బీబీ3 షూటింగ్‌ వాయిదా పడింది. సెప్టెంబర్‌ నుంచి రెగ్యూలర్‌ షూటింగ్‌ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే వేసవికాలంలో విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. 

చదవండి: బాలయ్యా మజాకా? అందులోనూ రికార్డులే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా