సంజయ్ దత్ భూమి ఫస్ట్ లుక్

29 Jul, 2017 16:21 IST|Sakshi
సంజయ్ దత్ భూమి ఫస్ట్ లుక్

సంజ‌య్‌ద‌త్ 58వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న తాజా చిత్రం `భూమి` చిత్ర ఫస్ట్‌లుక్ విడుద‌లైంది.  ఈ పోస్టర్ ను సంజయ్ దత్ స్వయంగా ఆయన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా రిలీజ్ చేశారు. సంజయ్ పోస్టర్ ట్వీట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే అది నేషనల్ లెవల్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది.   ఈ పోస్టర్‌లో సంజ‌య్ ముఖం మీద ర‌క్తపు మ‌ర‌క‌ల‌తో, చెదిరిన గ‌డ్డంతో క‌నిపించారు. ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తరువాత సంజయ్ లీడ్ రోల్ లో తెరకెక్కిన తొలి సినిమా ఇదే. ఈ సినిమాకు ఒమాంగ్ కుమార్ దర్శకుడు.