సంజయ్‌ దత్‌కు లీగల్‌ నోటీసులు!

31 Jul, 2019 15:32 IST|Sakshi

సాయికుమార్‌, శర్వానంద్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పొలిటికల్‌ థ్రిల్లర్‌ ప్రస్థానం. 2010లో దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇన్నేళ్ల తరువాత బాలీవుడ్‌లో రీమేక్‌ అయ్యింది. బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్‌ దత్‌ ప్రధాన పాత్రలో ఒరిజినల్ వర్షన్‌కు దర్శకత్వం వహించిన దేవా కట్టానే ఈ సినిమాను తెరకెక్కించారు.

సంజయ్‌ దత్‌ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. తాజాగా ఈ సినిమాపై వివాదం తెరమీదకు వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ షీమారు ఎంటర్‌టైన్మెంట్స్‌ లిమిటెడ్‌ ప్రస్థానం రీమేక్‌ రైట్స్ తమవద్ద ఉన్నాయంటూ వాదిస్తున్నారు. ఈ మేరకు సంజయ్‌ దత్‌కు లీగల్‌ నోటీసులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

అంతేకాదు ఈ విషయాన్ని సంజయ్‌ దత్‌తో గతంలోనే చర్చించామని అయినా సంజు బాబా అవేవి పట్టించుకోకుండా సినిమాను రూపొందించారంటూ ఆరోపిస్తున్నారు. అయితే ఈ వార్తలపై ప్రస్థానం దర్శక నిర్మాతలు స్పందించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు