వివాదంలో హీరో ‘అనధికార’ బయోగ్రఫీ

21 Mar, 2018 12:18 IST|Sakshi
సంజయ్‌ దత్‌ జీవితం ఆధారంగా విడుదలైన పుస్తక ముఖ చిత్రం

ముంబై: బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ జీవితం ఆధారంగా అనధికారికంగా విడుదలైన ‘ది క్రేజీ అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ బాలీవుడ్స్‌ బాడ్‌ బాయ్‌’ పుస్తక రచయిత, పబ్లిషర్స్‌పై సంజయ్‌ దత్‌ చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమతున్నారు. త్వరలోనే నిజమైన, అధికారిక బయోగ్రఫీ విడుదల అవుతుందని సంజయ్‌ దత్‌ సోషల్‌ మీడియా ద్వారా పేర్కొన్నారు. బాలీవుడ్స్‌ బాడ్‌ బాయ్స్‌ పుస్తక రచయిత యాస్సర్‌ ఉస్మాన్‌కు, పబ్లిషర్‌ జుగ్గర్‌నాట్‌కు నోటీసులు పంపారు. అలాగే వీరికి తాను తన బయోగ్రఫీ రాసేందుకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు.

పుస్తకంలో తాము ఎటువంటి సమాచారం జొప్పించలేదని, కేవలం పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్న సమాచారం మాత్రమే ప్రచురించడానికి ఉపయోగించామని పబ్లిషర్‌ జుగ్గర్‌నాట్‌ తెలిపింది. గతంలో పత్రికల్లో ప్రచురితమైన సమాచారం, తాను ఇచ్చిన ఇంటర్వ్యూలు, 1990 దశకంలో గాసిప్‌ మ్యాగజైన్‌లు రాసిన ఊహాజనితమైన సమాచారం ఆధారంగా చేసుకుని పుస్తకం రాశారని, అందులో తప్పుడు సమాచారం ఉందని సంజయ్‌ పేర్కొన్నారు. ఈ విషయం తనను, తన కుటుంబసభ్యులకు బాధ కలిగించిందని పేర్కొన్నారు.

సునీల్‌ దత్‌, నర్గీస్‌ ఎలా, ఎప్పుడు కలిసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, సంజయ్‌ దత్‌ జననం, బోర్డింగ్‌ స్కూల్లోసంజయ్‌ దత్‌ జీవనం, తల్లి నర్గీస్‌ మరణం, సోదరి,తండ్రితో సంజయ్‌ బంధం, మాదక ద్రవ్యాలకు బానిస కావడం, వాటి నుంచి బయటపడటం, సంజయ్‌ పెళ్లి, అండర్‌వరల్డ్‌తో సంబంధాలు, ముంబై బాంబు పేలుళ్ల కేసు, ప్రస్తుతం సంజయ్‌ దత్‌ పరిస్థితి తదీతర విషయాలు ‘ది క్రేజీ అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ బాలీవుడ్స్‌ బాడ్‌ బాయ్‌’లో చర్చకు వచ్చాయి.

మరిన్ని వార్తలు