21 ఏళ్ల తరువాత సంజు బాబా‌..!

7 Feb, 2019 11:07 IST|Sakshi

బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్‌ దత్‌, దాదాపు 21 ఏళ్ల తరువాత ఓ సౌత్‌ సినిమాలో నటించనున్నాడు. గతంలో నాగార్జున హీరోగా కృష్ణవంశీ తెరకెక్కించిన ‘చంద్రలేఖ’ సినిమాలో సంజయ్‌ దత్‌ అతిథి పాత్రలో కనిపించారు. ఇప్పుడు ఓ కన్నడ సినిమాలో నటించేందుకు సంజయ్‌ దత్‌ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా ‘కేజీయఫ్‌’.

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి భాగానికి సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వల్‌ను రూపొందించే పనిలో ఉన్నారు యూనిట్‌. ఈ సీక్వల్‌లో సంజయ్‌ దత్‌ గెస్ట్‌ అపియరెన్స్‌ ఇవ్వనున్నారట. సంజయ్‌ లాంటి క్రేజీ హీరో నటిస్తే సినిమాకు బాలీవుడ్ లో మంచి హైప్‌ వస్తుందనే చిత్రయూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ‘కేజీయఫ్‌ చాప్టర్‌ 2’ను 2020 చివర్లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కొత్త దర్శకుడితో?

వర్మ కాదు... ఆదిత్యవర్మ

హేమలతా లవణం

అంతా ఉత్తుత్తిదే

మిఠాయి బాగుంది 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సమ్మర్‌లో షురూ

అంతా ఉత్తుత్తిదే

కాంబినేషన్‌ కుదిరింది

వేలానికి  శ్రీదేవి  చీర 

కొత్త దర్శకుడితో?

హేమలతా లవణం