సంజయ్ దత్ 'ప్రస్థానం'..!

22 Aug, 2017 10:42 IST|Sakshi
సంజయ్ దత్ 'ప్రస్థానం'..!

భూమి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ స్టార్  హీరో సంజయ్ దత్, తన నెక్ట్స్ సినిమాల కథ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. హీరో ఇమేజ్ ను పక్కన పెట్టిన వయసుకు, లుక్ కు తగ్గ పాత్రలో కోసం ప్రయత్నిస్తున్నాడు. అందుకే భూమి సినిమా తరువాత ఓ తెలుగు సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు సంజూ భాయ్. చాలా ఏళ్ల క్రితం టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఓ చిన్న సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడట.

శర్వానంద్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఎమోషనల్ పొలిటికల్ థ్రిల్లర్ ప్రస్థానం. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ కాకపోయినా.. దర్శకుడిగా దేవ కట్టా కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఈ సినిమా రిలీజ్ సమయంలోనే బాలీవుడ్ లో రీమేక్ చేసే ఆలోచన చేసిన అప్పట్లో వర్క్ అవుట్ కాలేదు. ఇన్నేళ్ల తరువాత తిరిగి ఆ ప్రయత్నాలు ప్రారంభించాడు దేవ కట్టా. ఈ రీమేక్ లో సాయికుమార్ పాత్రలో సంజయ్ నటించే అవకాశం ఉంది. అంతేకాదు ఈ సినిమాను తానే స్వయంగా నిర్మించాలని భావిస్తున్నాడు సంజయ్. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.