బన్సాలీ డైరెక్షన్లో 'మనం' రీమేక్

4 May, 2016 11:29 IST|Sakshi
బన్సాలీ డైరెక్షన్లో 'మనం' రీమేక్

అక్కినేని ఫ్యామీలి మూడుతరాల హీరోలు కలిసి నటించిన క్లాసిక్ మూవీ మనం. అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రంగా భారీ హైప్ క్రియేట్ చేసిన మనం, కథా కథనాల విషయంలో కూడా కొత్తదనంతో ఆకట్టుకుంది. నాగార్జున కెరీర్ లోనే బిగెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా రీమేక్పై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. తాజాగా దర్శకుడు విక్రమ్ కె కుమార్ మనం బాలీవుడ్ రీమేక్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ, మనం సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ప్రస్తుతం విక్రమ్ డైరెక్షన్లో రిలీజ్కు రెడీ అవుతోన్న 24 సినిమా షూటింగ్ సమయంలో మనం రీమేక్పై చర్చ జరిగిందని వెల్లడించాడు విక్రమ్. 'ముంబైలో 24  మూవీ  షూటింగ్ జరుగుతున్న సమయంలో సంజయ్ లీలా బన్సాలీని కలిశాను. ఆయన మనం సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు', అని తెలిపాడు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నాడు విక్రమ్.

విక్రమ్ కె కుమార్ స్వయంగా మనం సినిమాను కోలీవుడ్ రీమేక్ చేయడానికి ట్రై చేశాడు. సూర్య, కార్తీ సూర్య తండ్రి శివకుమార్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమాను రీమేక్ చేయాలని భావించాడు. అయితే సూర్యకు మనం కన్నా 24 కథ బాగా నచ్చటంతో ముందుగా 24 సెట్స్ మీదకు వచ్చింది. మరి త్వరలో కోలీవుడ్లో కూడా మనం రీమేక్ అవుతుందేమో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా