నాని సంక్రాంతి సర్‌ప్రైజ్‌

13 Jan, 2018 11:19 IST|Sakshi

వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని ఈ సంక్రాంతికి అభిమానుల కోసం ఓ సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేశాడు. ఇటీవల ఎమ్‌సీఏ సినిమాలో మంచి విజయాన్ని అందుకున్న ఈ యంగ్‌ హీరో ప్రస్తుతం కృష్ణార్జున యుద్ధం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సినిమా రిలీజ్ కు ఇంకా చాలా సమయమున్నా.. అభిమానుల కోసం ఇప్పుడే ఫస్ట్ లుక్‌ లతో పాటు ఓ పాటను కూడా రిలీజ్ చేయబోతున్నారట. ఈ విషయాన్ని వీడియో మేసేజ్‌ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు నాని. ముందుగా 14వ తేదిన భోగి రోజు కృష్ణ పాత్ర ఫస్ట్ లుక్‌ను, సంక్రాంతి రోజు అర్జున్‌ పాత్ర ఫస్ట్‌లుక్‌ను తరువాత కనుమ రోజు తొలి పాటు లిరికల్ వీడియోనూ రిలీజ్ చేయనున్నారు.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని..కృష్ణ, అర్జున్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అనుపమా పరమేశ్వరన్‌హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాకు హిప్ హాప్ తమిళ సంగీతమందిస్తున్నాడు. వెంకట్ బోయనపల్లి సమర్పణలో షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మరిన్ని వార్తలు