కామెడీ విత్‌ యాక్షన్‌తో..

7 Jun, 2019 10:38 IST|Sakshi

తమిళసినిమా: నటుడు సంతానం కామెడీ విత్‌ యాక్షన్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నారు. సంతానం నటిస్తున్న తాజా చిత్రం డకాల్టీ. ఈ చిత్రం ద్వారా బెంగాలీ బ్యూటీ రిత్తికాసేన్‌ హీరోయిన్‌గా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది. ఇకపోతే యోగిబాబు, రాధారవి, రేఖ, బాలీవుడ్‌ నటుడు హేమంత్‌పాండే, సంతానభారతి, మనోబాలా, నమోనారాయణ, స్టంట్‌శిల్వా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో సంతానంతో నటుడు యోగిబాబు తొలిసారిగా నటిస్తున్నారు. దర్శకుడు శంకర్‌ శిష్యుడు విజయ్‌ఆనంద్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ హాలీవుడ్‌ నటుడు జాకీచాన్‌ చిత్రాల తరహాలో డకాల్టీ చిత్రం కామెడీతో కూడిన ఫైట్స్‌ సన్నివేశాలతో జనరంజకంగా ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్‌ను తిరుచెందూర్, తిరునెల్వేలి, కారైక్కుడి, చెన్నై, అంబాసముద్రం, కడప, పూనే, ముంబై ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. కాగా దీన్ని 18 రీల్స్‌ పతాకంపై తిరుపూర్‌కు చెందిన ప్రముఖ డాక్టర్, సినీ డిస్ట్రిబ్యూటర్‌ ఎస్‌పీ. చౌదరి భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా గాయకుడు విజయ్‌నారాయణన్‌ సంగీతదర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం తరువాత నిర్మాత ఎస్‌పీ.చౌదరి సంతానం హీరోగా మరో చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారు. ఆయన ఇంతకు ముందు నటించిన దిల్లుక్కు దుడ్డు చిత్రానికి పార్టు–3ని నిర్మించడానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని ఆయన 3డీ ఫార్మెట్‌లో రూపొందించడానికి ప్లాన్‌ చేస్తున్నారు.ఈ చిత్రం గురించి నటుడు సంతానంతో చర్చలు జరుపుతున్నట్లు నిర్మాత తెలిపారు.   

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా