‘గ‌జ‌దొంగ‌’గా స‌ప్తగిరి

8 Jul, 2018 15:16 IST|Sakshi

స‌ప్తగిరి ఎక్స్ ప్రెస్‌, స‌ప్తగిరి ఎల్‌.ఎల్‌.బి చిత్రాల‌తో హీరోగా ఆకట్టుకున్న కమెడియన్‌ సప్తగిరి మరోసారి హీరోగా నటిస్తున్న సినిమా గజదొంగ. తొలి రెండు చిత్రాల్లో కామెడీ జానర్‌లో నటించిన సప్తగిరి మూడో సినిమాగా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను ఎంచుకున్నారు. ఈ చిత్రాన్ని నంద నంద‌నా ప్రాజెక్ట్స్ ప‌తాకంపై శ‌ర్మ చుక్కా, యెడల నరేంద్ర, G .V .N .రెడ్డి  చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

గీతా ఆర్ట్స్, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థల్లో ద‌ర్శక‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన డి.రామ‌కృష్ణ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు శ‌ర్మ చుక్కా, యెడల నరేంద్ర, G .V .N .రెడ్డి మాట్లాడుతూ ‘స‌ప్తగిరికి యాప్ట్ స‌బ్జెక్ట్ ఇది. స‌ప్తగిరి నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాల‌న్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయి. 

మ‌హాన‌టుడు ఎన్టీఆర్ న‌టించిన ‘గ‌జ‌దొంగ’కూ, దీనికీ సంబంధం లేదు. ఇందులో స‌ప్తగిరిది దొంగ‌ల‌కు దొంగ‌లాంటి పాత్ర‌. అస‌లు సిస‌లు దొంగ‌ల్ని దోచుకుని స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే దొంగ‌గా క‌నిపించ‌నున్నాడు. విలేజ్‌, టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో న‌డిచే యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. ఆగ‌స్టు తొలి వారంలో చిత్రీక‌ర‌ణ మొద‌లుపెడ‌తాం’ అని తెలిపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు