సప్తగిరితో స్నేహం కుదిరింది – సాయిధరమ్‌ తేజ్‌

25 Nov, 2017 00:59 IST|Sakshi

హాస్యనటునిగా వెండితెరపై మంచి ప్రతిభ కనబరచి, ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంతో కథానాయకుడిగా మారారు నటుడు సప్తగిరి. చరణ్‌ లక్కాకుల దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి’. సెల్యూలాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ పతాకంపై డా. రవికిరణ్‌ నిర్మిస్తున్నారు. బుల్గానిన్‌ స్వరకర్త. డిసెంబర్‌ 7న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలోని ఓ పాటను ఇటీవల దర్శకుడు వీవీ వినాయక్‌ విడుదల చేశారు. రెండో పాట ‘చేతి గాజల చప్పుడికే మనసే పతంగిలా ఎగిరే’ను హీరో సాయిధరమ్‌ తేజ్‌ రిలీజ్‌ చేశారు.

ఈ సందర్భంగా సాయిధరమ్‌ మాట్లాడుతూ– ‘‘నా ‘తిక్క’ సినిమా సరిగా ఆడకపోయినా సప్తగిరితో మంచి స్నేహం కుదిరింది. తను హీరోగా నటించిన ఈ సినిమా టీజర్‌ చుశాను. నచ్చింది. రెండో పాట విజువల్‌గా బాగుంది. సప్తగిరి డ్యాన్సులు అదరగొట్టాడు. ఇంత బాగా చేస్తాడని ఊహించలేదు. బుల్గానిన్‌ మంచి సంగీతం ఇచ్చారు. సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘సాయిధరమ్‌ తేజ్‌ మా పాటను లాంచ్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకు థ్యాంక్స్‌’’ అన్నారు సప్తగిరి. ‘‘మా సినిమాలోని సాంగ్‌ను రిలీజ్‌ చేసినందుకు తేజ్‌కు థ్యాంక్స్‌’’ అన్నారు దర్శక–నిర్మాతలు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు