‘లవ్‌ ఆజ్‌ కల్‌ 2’ ఫస్ట్‌ డే కలెక్షన్‌ అదుర్స్‌.. కానీ!

15 Feb, 2020 12:51 IST|Sakshi

బాలీవుడ్‌ యువ నటుడు కార్తీక్‌ ఆర్యన్‌, హీరోయిన్‌ సారా అలీ ఖాన్‌, రణ్‌దీప్‌ హూడాలు ప్రధాన పాత్రలో నటించిన ‘లవ్‌ ఆజ్‌ కల్‌ 2’ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా (ఫ్రిబ్రవరి 14)న విడుదలైన సంగతి తెలిసిందే. దర్శకుడు ఇంతీయాజ్‌ అలీ 2009లోని ‘లవ్‌ ఆజ్‌ కల్‌’కు స్వీకెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. విభిన్న ప్రేమకథ భావాలతో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. సెన్సార్‌ బోర్డు కూడా సినిమాలో అసభ్యకర సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయంటూ చిత్ర యూనిట్‌కు షాకిచ్చింది. అలా ఎన్నో విమర్శల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు రూ. 12.40 కోట్లు వసూలు చేసింది. అయినప్పటికీ సినిమా అనుకున్న అంచనాలకు చేరుకోలేక పోయింది. అటు అభిమానుల నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తున్నాయి. 

‘లవ్‌ ఆజ్‌ కల్‌ 2’కు సెన్సార్‌ షాక్‌!

దర్శకుడు ఇంతీయాజ్‌ కాలానుగుణంగా ప్రేమలో వచ్చే మార్పులను చూపించేందుకు భిన్న ప్రేమ కథలను తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. కాగా కార్తీక్‌ ఆర్యన్‌ 2020 నాటి ప్రేమికుడు వీర్‌, 1990 నాటి రఘుగా ద్విపాత్రలు పోషించాడు. ఇక వీర్‌కు ప్రియురాలిగా సారా నటించగా.. 1990 నాటి రఘు ప్రేయసిగా లిలా పాత్రలో ఆరూషి నటించిది. ఇక ఆరూషికి ఇదే మొదటి సినిమా కూడా. ఇకపోతే విడుదలైన రోజునే ఈ సినిమాపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి.

ముఖ్యంగా సారా అలీ ఖాన్ చేసిన ఓవరాక్షన్ భరించలేపోయామంటు సారాపై మండిపడుతున్నారు. ఈ సినిమాలో కేవలం కార్తీక్‌ నటన మాత్రమే బాగుందని.. మిగతాదంతా అంతా చెత్తగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ప్యారాచూట్‌పై ఉన్న ఓ వ్యక్తి భయపడుతూ కళ్లు మూసుకున్న ఫొటోని షేర్‌ చేస్తూ.. ‘కావాలంటే 500 ఇస్తాం దయచేసి సినిమా ఆపండ్రా బాబు’ అంటూ క్రియోట్‌ చేసిన మీమ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

‘ఆ హీరోయిన్‌ చాలా ఓవర్‌ చేసింది’

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు