సైఫ్ వారసురాలి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ

10 Nov, 2016 11:39 IST|Sakshi
సైఫ్ వారసురాలి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ

గతంలో సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వారసురాళ్లు పెద్దగా వచ్చే వారు కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్టార్ హీరోల కూతుళ్లు కూడా వెండితెర మీద సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సోనాక్షి సిన్హా, సోనమ్ కపూర్ లాంటి తారలు వెండితెర మీద మెరుపులు మెరిపిస్తుండగా ఇప్పుడు మరో తార తెరంగేట్రానికి రంగం సిద్దమవుతోంది.

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ వెండితెర అంరంగేట్రానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ అమ్మడు చేయబోయే సినిమా కూడా ఫైనల్ అయిపోయిందట. బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్ హీరోగా జోయా అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాతో సారా హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే పబ్లిక్ అపియరెన్స్లలో తన స్టైల్స్ గ్లామర్ తో ఆకట్టుకుంటున్న సారా తొలి సినిమాతోనే సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.