నవ్వుల కూలీ!

23 Mar, 2019 04:59 IST|Sakshi
వరుణ్, ఫర్హాద్, డేవిడ్‌ ధావన్‌

జూలై నుంచి కూలీగా మారనున్నారు బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌. 1991లో వెంకటేశ్‌ హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ‘కూలీ నెం.1’ అదే పేరుతో హిందీలో రీమేక్‌ అయ్యింది. డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వంలో గోవింద నటించారు. ఇప్పుడు ఈ హిందీ ‘కూలీ నెం.1’ లేటెస్ట్‌ రీమేక్‌లో హీరోగా నటించే బాధ్యతను డేవిడ్‌ ధావన్‌ తనయుడు వరుణ్‌ ధావన్‌ తీసుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సారా అలీఖాన్‌ నటించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జూలై నుంచి ఆరంభం కానుంది. ‘‘ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కథలో మార్పులు చేశాం. మరింత హాస్యం ఉంటుంది. ప్రస్తుతం లొకేషన్స్‌ను సెలక్ట్‌ చేస్తున్నాం. ఫారిన్‌ షెడ్యూల్స్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నాం. త్వరలో చిత్రీకరణ మొదలుపెడతాం’’ అని చిత్రబృందం పేర్కొంది.

మరిన్ని వార్తలు