‘అచ్చం పటౌడి యువరాణిలా ఉంది’

7 Nov, 2019 18:08 IST|Sakshi

ముంబై: కేదార్‌నాథ్‌ సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది స్టార్‌ హీరో సైఫ్‌ ఆలీఖాన్‌ గారాల పట్టి సారా ఆలీఖాన్‌. బీ-టౌన్‌లో అడుగుపెట్టిన ఏడాదిలోనే మూడు సినిమాల్లో నటించి మెప్పించి బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. దీంతో సారాకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ బీభత్సంగా పెరిగిపోయింది. దీంతో ఆమెకు సంబంధించిన ప్రతీ విషయాన్ని హైలెట్‌ చేస్తున్నారు. తాజాగా సారా అలీఖాన్‌ షేర్‌ చేసిన తన చిన్ననాటి ఫోటోలకు ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

డ్యాన్స్‌ చేస్తున్నట్లుగా ఉన్న ఆ ఫోటోలో సారా అలీఖాన్‌ రాజస్థానీ సాంప్రదాయ దుస్తుల్లో అచ్చం పటౌడీ యువరాణిలా ఉందంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఎరుపు, నల్లని రంగు గాగ్రచోలీతో పాటు ఐషాడో, గ్లాసీలిప్‌స్టీక్‌తో పెద్ద చెవి దిద్దులు, బంగారు గాజులు ధరించిన ఈ ఫోటోలో సారా ఆలీఖాన్‌ భలే ముద్దుగా ఉందంటూ మరికొంత మంది నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

అలాగే మరో ఫోటోలో షీమ్మెరి బ్లాక్‌ లెహంగాతో పాటు బంగారు చెవి దిద్దులు, మాంగ్‌ తిలకం, గాజులు ధరించి.. ఎరుపు రంగు పాగా తలపై ధరించి ఉన్న ఫోటోకి ‘2000 సంవత్సరం నుంచి ఈ షాట్‌ కోసమే ఎదురు చుశాను’  అనే క్యాప్షన్‌ జత చేసి షేర్‌ చేసింది సారా అలీఖాన్‌. ప్రస్తుతం ఈ ఫోటో కూడా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. 

Waiting for my shot since 2000 ⏰ 🎥 🎬🔌🔜🙇🏻‍♀️#apnatimeayega #tbt #sarakadrama

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

ఇక గతేడాది వచ్చిన కేదర్‌నాథ్‌, సింబా సినిమాలతో హీరోయిన్‌గా మంచి విజయాలు సాధించిన సారా.. ఈ ఏడాది వరుణ్‌ ధావన్‌ కూలీ నెం.1 సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడంతో మరో విజయాన్ని సారా తన ఖాతాలో వేసుకుంది. కాగా సారా ఈ సినిమా షూటింగ్‌లో హీరో వరుణ్‌ ధావన్‌తో కలిసి చేసిన అల్లరి ఫోటోలను కూడా షేర్‌ చేసింది. 

Cool and Coolie💁🏻‍♀️🙆🏽‍♂️🧳👜👫🌈

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా