‘మీరు నాతో ఉంటే.. నేను ఎప్ప‌టికీ గెలుస్తా'

14 May, 2020 13:05 IST|Sakshi

లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉన్న సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియాల ద్వారా అభిమానుల‌కు చేరువుగా ఉంటున్నారు. రోజూ తాము చేసే ప‌నులను, గ‌త కాల‌పు జ్ఞాప‌కాల‌ను అభిమాను‌లతో పంచుకుంటున్నారు. ఈ క్ర‌మంలో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ త‌న చిన్నప్ప‌టి ఫోటోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలో సారాతో పాటు త‌న స్నేహితులు ఇషికా ష్రాఫ్‌, వేదికా పింటో ఉన్నారు. 'మీరు నాకు ప‌రిచ‌యమ‌య్యి నేటికి 8395 రోజులు అవుతుంది. మొద‌టి రోజు నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు నా ప్రాణ స్నేహితులుగా మారారు. మీరు నా స్నేహితులుగా ఉంటే నేను ఎప్పుడూ గెలుస్తూనే ఉంటాను' అంటూ త‌న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. (రానా, మిహీక ప్రేమ చిగురించింది అక్క‌డే!)

Through thick and thin (Literally 🐣🐥👧🏻👩🏻🎃) Known you for 8,395 Din.. 🗓 Thick as thieves, close as Kin💓👭 If you two are my friends I’ll always Win 👑 @ishroff @vedikapinto

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి రెండు సంవ‌త్స‌రాలే అవుతున్నా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ఈ బ్యూటీ. కాగా సారా ఇలా త్రోబ్యాక్ ఫోటోల‌ను షేర్ చేయ‌డం ఇదే మొద‌టిసారి కాదు. ఇంత‌కు‌ముందు కూడా మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా త‌ల్లి, అమ్మ‌మ్మ‌కు చెందిన ‌చిత్రాల‌ను పంచుకుంటూ.. 'మా అమ్మ‌ను ఇచ్చినందుకు నీకు(అమ్మ‌మ్మ‌) ధ‌న్య‌వాదాలు' అని పేర్కొన్నారు. క‌రోనా కార‌ణంగా షూటింగ్‌ల‌కు బ్రేక్ ప‌డ‌టంతో సారా న‌టిస్తున్న అక్ష‌య్ కుమార్‌, ధ‌నుష్ సినిమా కూడా వాయిదా ప‌డింది. దీంతో ప్ర‌స్తుతం సారా ముంబైలో త‌న త‌ల్లి అమృతా సింగ్‌, సోద‌రుడు ఇబ్ర‌హీం అలీ ఖాన్‌తో క‌లిసి క్వారంటైన్ స‌మయాన్ని క్వాలిటీ టైమ్‌గా మార్చుకుంటోంది. ఇంట్లో వంట‌లు, క్లీనింగ్, టీవీ చూడ‌టం, పుస్త‌కాలు చ‌ద‌వ‌డం,  వ‌ర్క‌వుట్‌లు చేస్తూ లాక్‌డౌన్ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. (పుకార్లపై స్పందించిన సల్మాన్‌ ఖాన్‌)

ప్ర‌భాస్‌ సినిమాలో 'మైనే ప్యార్ కియా' న‌టి

రాజసం ఉట్టిప‌డుతోన్న హీరోయిన్‌ చిన్న‌నాటి ఫొటో

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా