‘ఛీ ఛీ.. సారా.. ఇదేం ఫొటో’: నెటిజన్ల ఫైర్‌!

7 Mar, 2020 13:12 IST|Sakshi

బాలీవుడ్‌ భామ సారా అలీ ఖాన్‌ తీరుపై అభిమానులు, నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇటీవల ఆమె తన సొదరుడు ఇబ్రహీంతో కలిసి మాల్దీవుల పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక తమ్ముడి బర్త్‌డేను సెలబ్రేట్‌ చేయలేకపోయిన సారా.. తాజాగా తన తమ్ముడిని ట్రిప్‌కి తీసుకెళ్లారు. అక్కడ సముద్ర తీరాన ఇబ్రహీంతో కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేసి.. ‘మా తమ్ముడికి బర్త్‌ డే విషెస్‌ చెప్పండి’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేశారు. అయితే ఈ ఫొటోల్లో సారా బికినీ ధరించి ఉండటంపై నెటిజన్లు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. అంతేగాక తమ్ముడి పక్కన తను నిలబడిన తీరుపై మండిపడుతున్నారు. ‘ఇది సరైన పద్ధతి కాదు. నీ తమ్ముడు చూడు ఎంత అసౌకర్యంగా ఉన్నాడో. ఎంత హీరోయిన్‌ అయితే మాత్రం తమ్ముడి పక్కన ఇలా నిలబడటం పద్దతి కాదు’ అంటూ సారాకు క్లాస్‌ పీకుతున్నారు.(అది నన్ను చాలా బాధించింది: హీరోయిన్‌)

Happiest birthday Brother 🎂 🍰 🎁👫 I love you more than you know and am missing you lots today!! Wish I was with you 🤗 #tbt @ncstravels @luxnorthmale

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

‘అన్నయ్యా.. వదిన వచ్చింది చూడు..!’

మరికొందరు స్టార్‌డమ్ సారాను  ప్రభావితం చేయడం ప్రారంభించిందని కామెంట్లు చేస్తున్నారు.  ‘ పలుకుబడి, డబ్బుతో  మనుషులు ఎంతకైనా దిగజారి  ప్రవర్తిస్తారని సారాను చూస్తే మరోమారు రుజువైందని, పిల్లలకు తెలియకపోతే కనీసం పెద్దవాళ్లైనా ఏది సరైనదో, కాదో చెప్పాలి కదా’ అంటూ సూచిస్తున్నారు. అదేవిధంగా తను ఎలాంటి దుస్తులు వేసుకుందన్నది ముఖ్యం కాదు.. కానీ తమ్ముడితో కలిసి అలా పోజ్‌ ఇవ్వడం చూడటానికి అసభ్యకరంగా ఉంది’ అంటూ మండిపడుతున్నారు. కాగా సారాను ఇది వరకు కూడా ‘లవ్‌ ఆజ్‌ కల్‌’లో తన నటన చాలా ఓవర్‌గా ఉందంటూ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలో సాంప్రదాయ దుస్తుల్లో ఉండి అసభ్యకరంగా మాట్లాడటం ఎంటని నెటిజన్లు కామెంట్లు చేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా