‘ఆ హీరోయిన్‌ చాలా ఓవర్‌ చేసింది’

4 Feb, 2020 09:22 IST|Sakshi

సైఫ్‌ ముద్దుల తనయ సారా అలీ ఖాన్‌ ప్రస్తుతం ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. చేసింది రెండు సినిమాలే అయినా ఎంతో క్రేజ్‌ను తెచ్చుకున్నారు సారా. అయితే ఈ భామ యువ హీరో కార్తిక్‌ ఆర్యన్‌తో డేటింగ్‌ చేస్తుందని వచ్చిన పుకార్లను కొట్టిపారేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ‘లవ్‌ ఆజ్‌ కల్‌’ ట్రైలర్‌లో ఈ అమ్మడు చాలా ఓవర్‌ చేసిందంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. వీటిపై సారా స్పందిస్తూ.. ‘నా బరువు, అందం, ఫ్యాషన్‌పై విమర్శలు వచ్చినా నేను పట్టించుకోను.. కానీ నా నటన, నైపుణ్యంపై విమర్శలు వచ్చాయి. అదే నాకు పెద్ద పరీక్ష’ అన్నారు. మొదటి సారిగా విమర్శలు నన్ను చాలా బాధపెట్టాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

కార్తిక్‌తో ప్రేమలో ఉన్నా.. కానీ: సారా

కాగా ‘లవ్‌ ఆజ్‌ కల్‌’ ట్రైలర్‌లో సారా ‘నువ్వు నన్ను బగ్‌ చేస్తున్నావా’ అని చెప్పిన డైలాగ్‌కు విమర్శలు వస్తున్నాయి. ఆమె నటన అతిగా ఉందని, ఆ డైలాగ్‌ చెప్పెటప్పుడు తను ఎలాంటి దస్తులు ధరించిందో,  తను చెప్పిన డైలాగ్‌ ఎంటో ఓసారి చూసుకుంటే బాగుండని, జో గా నటించిన ఆ ఒక్కసీన్‌ తన అభిమానులను నిరాశకు గురిచేసిందంటూ సారాకు క్లాస్‌ పీకుతున్నారు. ఇక తనపై వస్తున్న విమర్శల గురించి దర్శకుడు ఇంతియాజ్‌తో కూడా మాట్లాడానని సారా చెప్పారు. అదేవిధంగా భవిష్యత్తులో తన నటన నైపుణ్యాన్ని మెరుగు పరుచుకొవడానికి ఈ విమర్శలు ఉపయోగకరంగా ఉంటాయని సానుకూలంగా స్పందించారు. 2010లో సైఫ్‌ అలీ ఖాన్‌, దీపికా పదుకొనెలు నటించి ‘లవ్‌ ఆజ్‌ కల్‌’ డైరెక్టర్‌ ఇంతియాజ్‌ అదే సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు