సర్దార్, శ్రీమంతుడుని దాటేశాడు

9 Apr, 2016 10:53 IST|Sakshi
సర్దార్, శ్రీమంతుడుని దాటేశాడు
భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన టాలీవుడ్ ఎంటర్టైనర్ సర్దార్ గబ్బర్సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్సింగ్ పాత్రలో కనిపించిన ఈ సినిమా రిలీజ్కు ముందు నుంచే రికార్డ్ల వేట మొదలు పెట్టింది. ముఖ్యంగా తెలుగులో సెకెండ్ బిగెస్ట్ హిట్గా నిలిచిన శ్రీమంతుడు రికార్డ్స్ను టార్గెట్ చేస్తూ రిలీజ్ అయిన ఈ సినిమా, తొలి అడుగులో అనుకున్నది సాధించింది.
 
ఓవర్ సీస్లో భారీగా ప్రీమియర్ షోస్ ఏర్పాటు చేసి దాదాపు 42 దేశాల్లో 180కి పైగా స్క్రీన్స్లో సర్దార్ గబ్బర్సింగ్ను రిలీజ్ చేశారు. దీనికి తోడు సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అవ్వటంతో తొలి రోజు వసూళ్లలో సంఛలనాలు నమోదు చేసింది. ఒక్కరోజులోనే ఆరు లక్షల డాలర్లకు పైగా వసూళ్లను సాధించి బాహుబలి తరువాత తొలి రోజు అత్యథిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది.
 
పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా డివైడ్ టాక్తో ఓపెన్ అయినా, పవర్ స్టార్ అభిమానులను మాత్రం బాగానే అలరిస్తోంది. మరో రెండు వారాల పాటు పెద్ద సినిమాలేవి రిలీజ్ లేకపోవటంతో సర్దార్ ఖాతాలో మరెన్ని రికార్డులు చేరుతాయో అని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నారు.