తొలిరోజు కలెక్షన్లు రూ. 31 కోట్లు

10 Apr, 2016 14:51 IST|Sakshi
తొలిరోజు కలెక్షన్లు రూ. 31 కోట్లు

చెన్నై: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్సింగ్ తొలిరోజు భారీ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా విడుదలైన శుక్రవారం రోజు ప్రపంచ వ్యాప్తంగా 31 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినట్టు ట్రేడ్ విశ్లేషకుడు త్రినాథ్ చెప్పాడు. టాలీవుడ్లో తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో చిత్రంగా బహుబలి తర్వాతి స్థానంలో సర్దార్ గబ్బర్సింగ్ నిలిచింది. శ్రీమంతుడి చిత్రం రికార్డులను బ్రేక్ చేసింది.

పవన్ కల్యాణ్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా డివైడ్ టాక్తో ఓపెన్ అయినా, పవర్ స్టార్ అభిమానులను అలరిస్తోంది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక ఇతర రాష్ట్రాలు, బాలీవుడ్లో 2 వేలకు పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు. దీనికితోడు దాదాపు 42 దేశాల్లో 180కి పైగా స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. కాగా తొలి రోజు రికార్డు కలెక్షన్లు వచ్చినా, రెండో రోజు శనివారం తగ్గినట్టు శ్రీనాథ్ చెప్పాడు. 'సర్దార్ గబ్బర్ సింగ్ తొలిరోజు 31 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇది అద్భుతమైన ఆరంభం. అయితే డివైడ్ టాక్ కారణంగా రెండో రోజు చాలా ప్రాంతాల్లో కలెక్షన్లు తగ్గాయి' అని శ్రీనాథ్ చెప్పాడు.