బాహుబలి 2లో శరద్ కేల్కర్

10 Mar, 2017 15:28 IST|Sakshi
బాహుబలి 2లో శరద్ కేల్కర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటుడు శరద్ కేల్కర్. ఈ సినిమా ఫ్లాప్ అయిన శరద్ లుక్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ హ్యాండ్సమ్ విలన్ మరోసారి టాలీవుడ్ న్యూస్ లో ప్రముఖంగా వినిపిస్తున్నాడు. ప్రతీ దక్షిణాది నటుడు చిన్న అవకాశం దొరికినా చాలు అని ఎదురుచూస్తున్న బాహుబలి సినిమాలో భాగం పంచుకున్నాడు శరద్.

అయితే బాహుబలి శరద్ నటుడిగా కనిపించటం లేదు. బాహుబలి హిందీ వర్షన్ తొలి భాగంలో ప్రభాస్ పాత్రకు డబ్బింగ్ చెప్పిన శరద్ తాజాగా బాహుబలి 2 ట్రైలర్ లో ప్రభాస్ కు డబ్బింగ్ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా రాజమౌళితో కలిసి దిగిన ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన శరద్ కేల్కర్, ' బాహుబలి సినిమాకు పనిచేయటం గౌరవంగా ఫీల్ అవుతున్నా.. రాజమౌళి గారికి కృతజ్ఞతలు. ట్రైలర్ త్వరలోనే వస్తోంది' అంటూ ట్వీట్ చేశాడు.