మెగా అభిమానులకు పండుగ వాతావరణం మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సర్దార్ గబ్బర్‌సింగ్ ఫీవర్ టాలీవుడ్లో మొదలైంది. ఈ ఆదివారం ఆడియో రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్ వేగం పెంచింది. ఇప్పటికే ఓ టీజర్, మేకింగ్ వీడియోతో పాటు స్టిల్స్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్, తాజాగా ఫస్ట్ సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేసింది. ముందుగా ప్రకటించిన విధంగా నాలుగు రోజుల పాటు నాలుగు రకాల టీజర్లను రిలీజ్ చేస్తామన్న యూనిట్ సభ్యులు.. ముందుగా సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు.
ఈసాంగ్ టీజర్ పవన్ తన మార్క్ స్టైల్స్‌తో అదరగొట్టాడు. సినిమాలో పవన్ క్యారెక్టరైజేషన్‌ను రివీల్ చేస్తూ రూపొందించిన ఈ టీజర్ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇవ్వనుంది. పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 8న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మార్చి 20న హైదరాబాద్ నొవాటెల్ హోటల్లో అభిమానుల సమక్షంలో దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సర్దార్ ఆడియో రిలీజ్ అవుతోంది.
Here it goes... Official Teaser of the title song. https://t.co/DiPG49bMNE #SardaarGabbarSingh #PawanKalyan.
— Sharrath Marar (@sharrath_marar) March 17, 2016