సంక్రాంతికి సర్థార్ సందడి

12 Dec, 2015 22:14 IST|Sakshi
సంక్రాంతికి సర్థార్ సందడి

గోపాల గోపాల సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంక్రాంతి పండగకి సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం సర్థార్ గబ్బర్సింగ్ షూటింగ్లో ఉన్న పవర్ స్టార్ ఈ సినిమా తొలి టీజర్ను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ టీజర్తో కొద్ది రోజులుగా సినిమా మీద వస్తున్న నెగెటివ్ పబ్లిసిటీకి కూడా చెక్ పెట్టాలని భావిస్తున్నారు.

ఇటీవలే గుజరాత్లో మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకొని వచ్చిన సర్థార్ గబ్బర్ సింగ్ టీం దాదాపు 40 శాతం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. గుజరాత్ షెడ్యూల్ నుంచి హీరోయిన్ కాజల్ కూడా షూటింగ్లో పాల్గొంటుండటంతో కొత్త సంవత్సరం కానుకగా కాజల్, పవన్ల పోస్టర్ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ టీజర్ ఎలా ఉండాలి అన్న అంశం మీద పవన్ కళ్యాణ్తో పాటు దర్శకుడు బాబీ కసరత్తులు ప్రారంభించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి