ఆ సినిమా సరిగా ఆడలేదు: దర్శకుడు

16 Apr, 2018 16:49 IST|Sakshi

శ్రీదేవి, అనిల్‌ కపూర్‌, జాకీ ష్రాఫ్‌, అనుపమ్‌ ఖేర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘రూప్‌ కి రాణి చోరోం కా రాజా’ చిత్రం ఏప్రిల్‌ 16, 1993లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన స్నేహితుడు సతీశ్‌ కౌశిక్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ బోనీ కపూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం దర్శకునిగా, నటుడిగా కొనసాగుతున్న సతీశ్‌ తన తొలి చిత్రం విడుదలై నేటికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఆ సినిమా జ్ఞాపకాలను ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు.

‘25 ఏళ్ల క్రితం బోనీ కపూర్‌ నాకు ఈ చిత్రం ద్వారా బ్రేక్‌ ఇవ్వాలని చూశారు. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించలేకపోయింది. అందుకు బోనీకి క్షమాపణలు. అది నా మనస్సుకు ఎంతో దగ్గరయిన చిత్రం. ఈ చిత్రం గురించి తలుచుకుంటే శ్రీదేవి మేడమ్‌ గుర్తొస్తున్నారు’ అని సతీశ్‌ ట్వీట్‌ చేశారు. ఈ చిత్రంలో నటించిన అనిల్‌ కపూర్‌, అనుపమ్‌ ఖేర్‌ కూడా ఈ చిత్రంతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

రూప్‌ కి రాణి చోరోం కా రాజా చిత్రం విడుదలై 25 ఏళ్లు గడిచాయంటే నమ్మకలేకపోతున్నాను. ఈ చిత్ర నిర్మాణంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొనప్పటికీ, ఇది ఒక మరచిపోలేని జ్ఞాపకం. ప్రతి రోజు రూప్‌ కి రాణిని మిస్‌ అవుతున్నామని అనిల్‌ కపూర్‌ ట్వీట్‌ చేశారు. కొన్ని అపజయాల్లో కూడా గొప్ప విజయం ఉంటుంది అని అనుపమ్‌ ఖేర్‌ తన సందేశాన్ని తెలిపారు. అభిమానులు మాత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించకపోయినా.. ఇది ఒక మంచి చిత్రమని తమ స్పందన తెలియజేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు