540 సినిమాల్లో నటించా

2 Mar, 2019 07:24 IST|Sakshi
అప్పన్న సన్నిధిలో నటుడు సత్యప్రకాష్‌

పోలీస్‌ స్టోరీ చిత్రం నా అదృష్టం

సినీ నటుడు సత్యప్రకాష్‌

విశాఖపట్నం, సింహాచలం (పెందుర్తి): బ్యాంక్‌ ఉద్యోగి నుంచి ఎక్కడెక్కడో ప్రయాణించి చివరికి సినిమా యాక్టర్‌ అయ్యానని చెప్పారు ప్రముఖ సినీ నటుడు సత్యప్రకాష్‌. వరాహ లక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. ఈసందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. ఆయన మాట ల్లో... బ్యాంక్‌ ఉద్యోగిగా పనిచేసి ఆ తర్వాత డిఫెన్స్‌లో చేరా. ఆ తర్వాత కొన్నాళ్లు ఎక్కడెక్క డో ప్రయాణాలు సాగించా. చివరికి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలెట్టాను. అలా ప్రయత్నిస్తున్న నాకు కర్ణాటకలో పోలీస్‌ స్టోరీ సినిమా అవకాశం వచ్చింది. అది అతిపెద్ద హిట్‌ అయ్యింది. ఆ సినిమా నా అదృష్టం. నా జీవితం మలుపు తిరిగింది అక్కడే. ఆ నాటి నుంచి సినిమా అవకాశాలు రావడం మొదయ్యా యి. ఆ తర్వాత తెలుగులో నటించే చాన్స్‌ దొరి కింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్‌కల్యాణ్, మహేష్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌ తదితర హీరోలతో తెలుగులో సినిమాలు చేశాను. అన్ని సినిమాలు చాలా బాగా ఆడాయి.

నా 25 ఏళ్ల సినీ జీవీతంలో నటుడు, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా ఎదిగా. ఇప్పటికి పది భాషల్లో 540 సినిమాల్లో నటించా. ప్రస్తుతం నటిస్తూనే మా అబ్బాయి నటరాజ్‌ హీరోగా సినిమా తీస్తున్నా. ఇన్ని అవకాశాలు రావడం ఆ భగవంతుడు, ప్రేక్షకుల ఆశీస్సులే. దృష్టి, అధ్భుతం అనే తెలుగు సినిమాల్లో, గిరిగిట్లే అనే కన్నడ సినిమాల్లో ప్రస్తుతం నటిస్తున్నాను. అలాగే నా కొడుకు నటరాజ్‌ హీరోగా హుల్లాలా హుల్లాలా అనే హర్రర్‌ కామెడీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నా. చిరంజీవి నా అభిమాన నటుడు. ఆయనంటే ఎనలేని అభిమానం. హిందూ మతాన్ని పెంపొందించేందుకు ప్రయత్నించాలని కోరుకుంటున్నా. అందుకోసం కృషి చేస్తున్నా. ప్రతి ఒక్కరూ బీదలు, వయో వృద్ధులు, పాఠశాల విద్యార్థులు, అంధులకు సహకారం అందించాలి. దర్శనార్థం వచ్చిన సత్యప్రకాష్‌ కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదాన్ని అధికారులు అందజేశారు.

మరిన్ని వార్తలు