కట్టప్ప సీక్రెట్‌ను చెప్పేసిన సత్యరాజ్?

8 Mar, 2017 12:29 IST|Sakshi
కట్టప్ప సీక్రెట్‌ను చెప్పేసిన సత్యరాజ్?

ప్రపంచంలో ఇప్పటికీ తెలియకుండా ఉండిపోయిన అతిపెద్ద రహస్యాలలో ఒకటి.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ విషయాన్ని తాజాగా కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ చెప్పేశారు. ఇన్నేళ్లుగా ఎవరికీ తెలియని సమాధానాన్ని ఆయన బహరింగపరిచారని అంటున్నారు. జాతీయ మీడియాతో మాట్లాడే సందర్భంలో ఒకానొక బలహీన క్షణంలో సత్యరాజ్ ఈ సీక్రెట్‌ రివీల్ చేసేశాడని చెబుతున్నారు. తొలుత ఎంత అడిగినా మాట్లాడని సత్యరాజ్.. చివర్లో మాత్రం 'మా డైరెక్టర్ చంపమని చెప్పారు, చంపేశాను.. అంతే' అని అసలు విషయం తేల్చిచెప్పేశారట.

భారతీయ సినీ చరిత్రలోనే అద్భుతమైన విజయం సాధించిన బాహుబలి సినిమా విడుదలైన తర్వాత.. ఈ ప్రశ్న బాగా వైరల్ అయ్యింది. ప్రపంచంలో తనకు కనపడిన ప్రతి ఒక్కరూ అదే విషయం అడుతుతున్నారని, చివరకు ఆ ప్రశ్న అంటేనే తనకు ఇరిటేషన్ రావడం మొదలైందని సత్యరాజ్ అన్నారు. తన సొంత కుటుంబ సభ్యులకు కూడా ఆ విషయం చెప్పలేదని తెలిపారు. తాను సినీ పరిశ్రమలో 40 ఏళ్లుగా ఉంటున్నానని, సినిమాకు అత్యంత కీలకమైన విషయాన్ని లేదా క్లైమాక్సును ముందే చెప్పేయడం నైతికత కాదని ఆయన అన్నారు. తన పాత్ర కీలకం అవుతుందని అనుకున్నాను గానీ, జాతీయవ్యాప్తంగా ఇంత చర్చ జరుగుతుందని మాత్రం ఊహించలేదని తెలిపారు. చివరకు పెద్దనోట్ల రద్దు సమయంలో కూడా తన కట్టప్ప పేరును చాలామంది వాడుకున్నారని, అందుకు తనకు కూడా సంతోషం అనిపించిందని అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా