'ఫస్ట్ లుక్ అదిరింది.. ఆల్ ది బెస్ట్'

16 Jun, 2016 20:19 IST|Sakshi
'ఫస్ట్ లుక్ అదిరింది.. ఆల్ ది బెస్ట్'

అఖిల్ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సాయేషా సైగల్. ప్రస్తుతం బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తుంది. బాలీవుడ్ మూవీ 'శివాయ్'తో స్టార్ హీరో అజయ్ దేవగణ్ కు జత కట్టింది. శివాయ్ లో సాయేషా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. మూవీ హిట్ అవ్వాలని, తనను ఆశీర్వదించాలని  కోరుతూ సాయేషా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కు స్పందించిన టాలీవుడ్ హీరో నితిన్.. ఫస్ట్ లుక్ అదిరింది, ఆల్ ద బెస్ట్ ఫర్ మూవీ అంటూ రీట్విట్ చేశాడు.

థ్యాంక్యూ నితిన్, ఎప్పటికీ నువ్వే నా తొలి నిర్మాతవు అని మరో ట్వీట్ తో బదులిచ్చింది. ఎప్పటికీ నీ ప్రేమ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నట్లు సాయేషా రాసుకొచ్చింది. అఖిల్ మూవీకి నితిన్ నిర్మాత అన్న విషయం తెలిసిందే. మరోవైపు శివాయ్ మూవీకి అజయ్ దేవగణ్ అన్నీ తానై పనుల్లో బిజీబిజీగా ఉన్నాడు. శివాయ్ కి దర్శకుడిగా, సహ నిర్మాతగానూ అజయ్ వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీ అక్టోబర్ 28న విడుదల చేయనున్నట్లు ఇటీవలే మూవీ యూనిట్ ప్రకటించింది.