ట్రాన్స్‌జెండర్‌ పాత్ర నుంచి తప్పుకున్న హీరోయిన్‌

14 Jul, 2018 16:01 IST|Sakshi
హాలీవుడ్‌ నటి స్కార్లెట్‌ జాన్సన్‌, జీన్‌ మేరీ గిల్‌ అలియాస్‌ డాంటె టెక్స్‌ గిల్‌

‘‘టాన్స్‌జెండర్‌ గ్యాంగ్‌స్టర్‌’’ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ‘‘రబ్‌ అండ్‌ టగ్‌’’ చిత్రం నుంచి హాలీవుడ్‌ నటి స్కార్లెట్‌ జాన్సన్‌ తప్పుకున్నారు. ట్రాన్స్‌జెండర్‌ ‘‘డాంటె టెక్స్‌ గిల్‌’’ పాత్రలో నటించాల్సిన ఆమె విమర్శల దృష్ట్యా వెనకడుగు వేశారు. నటి  స్కార్లెట్‌ జాన్సన్‌ అవెంజర్స్‌ సిరీస్‌, బ్లాక్‌ విడో వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. స్కార్లెట్‌ జాన్సన్‌ మాట్లాడుతూ.. ‘‘ నా శ్రేయోభిలాషులు ఇచ్చిన సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ట్రాన్స్‌జెండర్స్‌పై మన సమాజంలో మంచి భావన ఉంది. వారి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను.

వారి మీద నాకు ఎంతో గౌరవం ప్రేమ ఉన్నాయ’’ని ఆమె తెలిపింది. 1970-80ల నాటి ‘‘ట్రాన్స్‌జెండర్‌ గ్యాంగ్‌స్టర్‌ ’’ జీన్‌ మేరీ గిల్‌ అలియాస్‌ డాంటె టెక్స్‌ గిల్‌ మసాజ్‌ పార్లర్ల పేరిట వ్యభిచార గృహాలను నడిపేది. ఆమె ఓ మహిళ అయినప్పటికి పురుషుని వేషధారణతో ఉండేది. వ్యభిచారం, ‍డ్రగ్స్‌ రవాణాతో పిట్స్‌బర్గ్‌ నేరసామ్రాజ్యాన్ని ఏలిన ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేసి ఏడు సంవత్సరాల పాటు జైలులో ఉంచారు. దీంతో ఆమె నేర సామ్రాజ్యం పతనమైంది.   

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా