కోర్టులో అల్లూరి

13 Nov, 2019 00:05 IST|Sakshi

కోర్టు బోనులో నిలబడి వాదిస్తున్నారు రామ్‌చరణ్‌. ఈ వాడివేడి వాదనను వచ్చే ఏడాది జూలైలో విడుదల కానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో చూడొచ్చు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు పాత్రను చరణ్, కొమరం భీమ్‌ పాత్రను ఎన్టీఆర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కోర్టులో అల్లూరి తన వాదన వినిపించే సీన్స్‌ తీయడం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో కోర్టు సెట్‌ వేశారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలైలో విడుదల కానుంది.

మరిన్ని వార్తలు