మరణం తర్వాత కూడా ప్రేమ కోసం...

27 Nov, 2017 01:18 IST|Sakshi

శరత్, కారుణ్య జంటగా నటించిన చిత్రం ‘సీత... రాముని కోసం’. తస్మయ్‌ చిన్మయ ప్రొడక్షన్‌, రోల్‌ కెమెరా యాక్షన్‌ పతాకాలపై ఇబాక్స్‌ తెలుగు టీవీ సమర్పణలో అనిల్‌ గోపిరెడ్డి దర్శకత్వంలో శిల్పా శ్రీరంగం, సరితా గోపిరెడ్డి, డా నంద నిర్మించారు. ఈ చిత్రం టీజర్, మేకింగ్‌ వీడియోను ఒకేసారి ఇటు హైదరాబాద్‌లోను అటు అమెరికాలోను రిలీజ్‌ చేశారు. ఫస్ట్‌ లుక్‌ మేకింగ్‌ని హీరో తల్లి  జ్యోతి రిలీజ్‌ చేయగా, టీజర్‌ని స్వామి చిదాత్మానంద రిలీజ్‌ చేశారు. స్వామి చిదాత్మానంద మాట్లాడుతూ – ‘‘టీజర్‌ చాలా బాగుంది.

చిన్నప్పట్నుంచి హీరో కావాలన్నది శరత్‌ కల. ఈ చిత్రంతో అది  నెరవేరింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆశీర్వదిస్తున్నాను’’ అన్నారు. అనిల్‌ గోపిరెడ్డి మాట్లాడుతూ– ‘‘వైకుంఠ పాళి’, ‘బిస్కెట్‌’ చిత్రాల తర్వాత రెండేళ్ల పాటు ఈ స్క్రిప్ట్‌ పై వర్క్‌ చేశాను. ఫస్ట్‌ ఐ ఫోన్‌ లో టెస్ట్‌ షూట్‌ చేసిన తర్వాత రెడ్‌ కెమెరాతో ఈ చిత్రాన్ని షూట్‌ చేశాం. డెఫినెట్‌గా ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారు. శరతకి ఇది ఫస్ట్‌ సినిమా అయినా ఎంతో ఎక్స్‌పీరియస వున్న హీన్‌లా నటించాడు.

ఓ అబ్బాయిని ఒక అమ్మాయి ఎంతలా ప్రేమించింది? తాను చనిపోయాక కూడా ఆ ప్రేమను పొందడానికి ఎలా పరితపించింది? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ చిత్రానికి మ్యూజిక్‌ నేనే చేశాను. మొత్తం 5 పాటలున్నాయి. సెకండాఫ్‌ అంతా ఒళ్ళు గగుర్పొడిచే విధంగా వుంటుంది’’ అన్నారు. ‘‘టీజర్‌ అద్భుతంగా వుంది. సినిమా దానికంటే రెండింతలు వుంటుంది’’ అన్నారు హీరో శరత్‌. అద్భుతమైన పాత్ర చేశానని హీరోయిన్‌ కారుణ్య చెప్పారు. పాటల రచయిత వెంగి, మాటల రచయిత వేణు రాచరల తదితరలు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా