మరో విభిన్న పాత్రలో

19 Oct, 2018 08:19 IST|Sakshi

నటుడు విజయ్‌సేతుపతి ఎదుగుదల ఆశ్చర్య పరుస్తోంది. ఆయన కథలను ఎంచుకునే విధానం, ఆయా పాత్రల్లో వైవిధ్యం చూపడానికి పడే తపన, శ్రమ చూస్తుంటే, ఈ ఎదుగుదలకు విజయ్‌సేతుపతి అర్హుడే అని ఎవరైనా చెబుతారు. ఇటీవల ఆయన నటించిన 96 చిత్రం విమర్శకులను సైతం మెప్పించింది. తాజాగా విజయ్‌సేతుపతి నటిస్తున్న చిత్రాల్లో సీతకత్తి ఒకటి. 

ఈ చిత్రంలో ఆయన పలు గెటప్‌లలో కనిపంచనున్నారు. ముఖ్యంగా నటుడు కమలహాసన్‌ ఇండియన్‌ చిత్రంలో కనిపించిన తరహాలో 80 ఏళ్ల వృద్ధుడిగా నటించారు. ఆయనకు భార్యగా, జాతీయ అవార్డు గ్రహీత, సీనియర్‌ నటి అర్చన నటించడం మరో విశేషం. నటి అర్చన చాలా కాలం తరువాత నటించిన చిత్రం సీతకత్తి.

నటి రమ్యనంభీశన్, పార్వతినాయర్, భాగవతి పెరుమాళ్, మౌళి తదితరులు ఇత ప్రధాన పాత్రల్లో నటించారు. ఫ్యాషన్‌ స్డూడియోస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను ముగించుకుని, తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. చిత్రం క్లీన్‌ యూ సర్టిఫికెట్‌ పొందినట్లు చిత్ర వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి.

బాలాజీ ధరణీధరన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి అయ్య అనే సింగిల్‌ సాంగ్‌ ఇటీవలే విడుదలై సంగీత ప్రియులను అలరిస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్‌సేతుపతి తాజా చిత్రం సీతకత్తిపైనా అంచనాలు భారీ స్థాయిలోనే నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని నవంబరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు