ప్రేమకథ మొదలు

10 Sep, 2019 00:17 IST|Sakshi
సాయి పల్లవి, శేఖర్‌ కమ్ముల, నాగచైతన్య

‘భానుమతి–హైబ్రిడ్‌ పిల్ల..’ అంటూ సాయి పల్లవితో తెలంగాణ యాస మాట్లాడించి, ఫిదా చేశారు శేఖర్‌ కమ్ముల. ఇప్పుడు నాగచైతన్యతో కూడా మాట్లాడించబోతున్నారు. చైతూతో తొలిసారి సినిమా చేయబోతున్నారు శేఖర్‌. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌. ఏమిగోస్‌ క్రియేషన్స్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్, పి రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ సోమవారం మొదలైంది. ఏషియన్‌ గ్రూప్స్‌ అధినేత సునీల్‌ నారంగ్‌ స్క్రిప్ట్‌ను శేఖర్‌ కమ్ములకు అందించగా, శేఖర్‌ తండ్రి శేషయ్య క్లాప్‌ ఇచ్చారు. డిస్ట్రిబ్యూటర్‌ సదానంద కెమెరా స్విచాన్‌ చేశారు.

‘‘మూడు షెడ్యూల్స్‌లో సినిమాని ప్లాన్‌ చేశాం. ఈ రోజు మొదలైన షెడ్యూల్‌ పది రోజులు జరుగుతుంది’’ అన్నారు పి. రామ్మోహన్‌ రావు. ‘‘పల్లెటూరి నుంచి సిటీకి వచ్చి జీవితంలో ఏదో సాధించాలనుకునే ఇద్దరి మధ్య జరిగే ప్రేమకథ ఇది. తెలంగాణ యాసని చైతూ బాగా ఇష్టపడి నేర్చుకున్నాడు. తన పాత్ర సినిమాకు హైలెట్‌. సాయిపల్లవి ఈ కథకు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. నా సినిమాల్లో మ్యూజిక్‌ బలంగా ఉంటుంది. ఈ సినిమాలో మరింత బలంగా ఉంటుంది. రెహమాన్‌ స్కూల్‌ నుంచి వచ్చిన పవన్‌ ఈ సినిమాకు మ్యూజిక్‌ అందిస్తున్నాడు’’ అని శేఖర్‌ కమ్ముల అన్నారు. భరత్‌ నారంగ్, కో ప్రొడ్యూసర్‌ విజయ్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: పవన్, కెమెరా: విజయ్‌ సి. కుమార్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అందరూ ఆమెనే టార్గెట్‌ చేశారా?

ఆ ముగ్గురు పునర్నవిని దూరం పెట్టారా?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అలీ రీఎంట్రీ?

బాబా భాస్కర్‌ ఎవరిని సేవ్‌ చేయనున్నాడు?

ఆకట్టుకుంటోన్న​ ‘చాణక్య’ టీజర్‌

వాల్మీకి ట్రైలర్‌ : గత్తర్‌లేపినవ్‌.. చింపేశినవ్‌ పో!

అత్తగారికి ప్రేమతో.. మీ షారుఖ్‌

మరోసారి ‘ఫిదా’ చేసేందుకు రెడీ!

‘90ఎంఎల్‌’ అంటోన్న యంగ్‌హీరో

విడాకులు తీసుకోనున్న ఇమ్రాన్‌ ఖాన్‌?!

అమ్మమ్మ కాబోతున్న అందాల నటి!

‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ చౌహన్‌’గా ఖిలాడి

తిరుపతిలోనే నా పెళ్లి: జాన్వీ కపూర్‌

లేడీ విలన్‌?

మాస్‌.. మమ్మ మాస్‌?

రియల్‌ మెగాస్టార్‌ని కలిశా

జీవితమంటే ఆట కాదు

ఏదైనా నేర్చుకోవడమే

రండి రండి.. దయ చేయండి

రహస్య భేటీ

ఇల్లు.. పిల్లలు కావాలి

సినిమా సౌధానికి మేనేజర్లు పునాదిరాళ్లు

అలీ అవుట్‌.. షాక్‌లో హౌస్‌మేట్స్‌

బిగ్‌బాస్‌.. అతను లేకుంటే షో చూడటం వేస్ట్‌!

భర్తను ఏడిపించిన ప్రియాంక చోప్రా

బిగ్‌బాస్‌.. అడ్డంగా బుక్కైన శ్రీముఖి

బిగ్‌బాస్‌.. హోస్ట్‌గా నాని!

మరో మాస్‌ డైరెక్టర్‌తో రామ్‌!

‘మ్యాగీ’ డ్రెస్‌.. రెడీ కావడానికే 2నిమిషాలే!

‘గ్యాంగ్‌ లీడర్‌ అందరినీ మెప్పిస్తాడు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమకథ మొదలు

అందరూ ఆమెనే టార్గెట్‌ చేశారా?

ఆ ముగ్గురు పునర్నవిని దూరం పెట్టారా?

బాబా భాస్కర్‌ ఎవరిని సేవ్‌ చేయనున్నాడు?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అలీ రీఎంట్రీ?

అత్తగారికి ప్రేమతో.. మీ షారుఖ్‌