బాలయ్యకు విలన్గా మరో హీరో

30 Jun, 2017 13:18 IST|Sakshi

సీనియర్ హీరో బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల తన వందో సినిమాగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణితో ఘనవిజయం సాధించిన ఈ సీనియర్ హీరో, ఆ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకొని పూరి జగన్నాథ్ దర్వకత్వంలో పైసా వసూల్ సినిమాను స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

పైసావసూల్ సెట్స్ మీద ఉండగానే తన 102వ సినిమా పనులు కూడా స్టార్ట్ చేశాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ గా ఓ స్టార్ హీరో నటించనున్నాడు. గతంలో ఘనవిజయం సాధించిన లెజెండ్ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటించాడు. అదే బాటలో నెక్ట్స్ సినిమాలో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్, బాలయ్యకు ప్రతినాయకుడిగా తలపడనున్నాడు.

ఇప్పటికే మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన సినిమాలో విలన్ గా నటించిన శ్రీకాంత్, త్వరలో తెలుగు సినిమాలోనూ నెగెటివ్ రోల్ లో దర్శనమివ్వనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను సీ కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. బాలయ్య నయనతార మరోసారి హీరోయిన్ గా నటిస్తోంది.