ఆరు ప్రేమకథలు

21 Apr, 2019 00:20 IST|Sakshi
హవీష్‌, రెజీనా

‘‘ఆరుగురు అమ్మాయిలు.. ఆరు ప్రేమకథలు.. విచిత్రంగా ఆరు ప్రేమకథల్లోనూ అబ్బాయి ఒక్కడే. ఆరుగురు అమ్మాయిలను ఒకేసారి ప్రేమిస్తున్న ఆ అబ్బాయి మంచోడా? చెడ్డోడా?’’  తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటోంది ‘సెవెన్‌’ చిత్రబృందం.  హవీష్‌ హీరోగా నిజార్‌ షఫీ దర్శకత్వం వహించిన చిత్రం ‘సెవెన్‌’. రెజీనా, అనీషా ఆంబ్రోస్, త్రిదా చౌదరి, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రమేష్‌ వర్మ కథ అందించడంతో పాటు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘‘సెవెన్‌’ మూవీ షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదో రొమాంటిక్‌ థ్రిల్లర్‌ డ్రామా. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. ఊహించని మలుపులు ఉంటాయి’’ అన్నారు రమేష్‌ వర్మ. ఈ సినిమాకు కెమెరా: నిజార్‌ షపి, సంగీతం: చైతన్య భరద్వాజ్‌. 

మరిన్ని వార్తలు