యాక్సిడెంట్‌ తర్వాత తొలి ఫొటో..

1 Feb, 2020 14:40 IST|Sakshi

ముంబై : అలనాటి బాలీవుడ్‌ నటి షబానా అజ్మీ జనవరి 18న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రెండు వారాలపాటు కోకిలాబెన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన షబానా శుక్రవారం డిశ్చార్జ్‌ అయ్యారు. చికిత్స అనంతరం ఇంటికి చేరిన షబానా తన తాజా ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసిన అభిమానులకు, ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. అలాగే హాస్పిటల్‌లో తనకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు ఆరోగ్యం గురించి కేర్‌ తీసుకున్న నీతా అంబానీ, కోకిలాబెన్‌ అంబానీలతోపాటు వైద్యులకు ఆమె థ్యాంక్స్‌ చెప్పారు. 

రాయగఢ్‌ జిల్లాలో ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్‌ హైవేపై షబానా  ప్రయాణిస్తున్న టాటా సఫారీ వాహనం జనవరి 18న ప్రమాదానికి గురైంది. డ్రైవర్‌ ముందుగా వెళుతున్న ట్రక్కును ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో దాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే షబానాను నవీ ముంబైలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కోకిలాబెన్‌ ఆస్పత్రికి మార్చారు. ఈ విషయం తెలుసుకున్న పలువరు బాలీవుడ్‌ ప్రముఖలు హాస్పిటల్‌లో షబానాను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ కూడా ట్వీట్‌ చేశారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు