‘ఒక్క క్షణం ఊపిరి తీసుకోవడం మర్చిపోయాను’

29 Jun, 2018 16:51 IST|Sakshi

భారీ అంచనాల మధ్య రికార్డు స్థాయిలో విడుదలైన ‘సంజు’ సినిమా బాక్సాఫీస్‌ కలెక్షన్లను కొల్లగొడుతూ సూపర్‌ హిట్‌ వైపు దూసుకెళ్తోంది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్న ఈ సినిమాను బాలీవుడ్ ప్రముఖులు కూడా తెగ అభినందిస్తున్నారు. తాజగా ఈ జాబితాలోకి మరో సీనియర్‌ నటి చేరారు.

విభిన్న కథలతో...అద్భుతమైన నటనతో హిందీ చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ హీరోయిన్‌ షబనా ఆజ్మీ ‘సంజు’ను అభినందిస్తూ ట్విటర్‌లో మెసేజ్‌ చేశారు. ఈ సందర్భంగా రిషి కపూర్‌ను ట్యాగ్‌ చేస్తూ ‘సంజు సినిమా చూశాను...రణ్‌బీర్‌ జీవితంలోనే ఇది అద్భుతమైన సినిమా అవుతుంది. ‘సంజు’లో రణ్‌బీర్‌ యాక్టింగ్‌ చూసి నిజంగా ఒక్క క్షణం నేను ఊపిరి తీసుకోవడం మర్చిపోయాను. విక్కి కౌశల్‌ నువ్వు నీ పాత్రకు న్యాయం చేశావు’అని మెసేజ్‌ చేశారు.

మరిన్ని వార్తలు