‘సాహో’.. యాక్షన్‌ మేకింగ్‌ వీడియో

23 Oct, 2018 11:08 IST|Sakshi

టాలీవుడ్‌ మ్యాన్లీ హీరో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సాహో. బాహుబలి లాంటి సూపర్‌ హిట్ తరువాత ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో సాహోపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా 300 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం డార్లింగ్‌ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లు ఒక్క ఫస్ట్‌లుక్‌తోనే సరిపెట్టిన చిత్రయూనిట్ ఈ రోజు(మంగళవారం) ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా షేడ్స్‌ ఆఫ్‌ సాహో చాప్టర్‌ 1 పేరుతో అభిమానులుకు గిఫ్ట్ ఇచ్చారు. యాక్షన్‌ సీన్స్‌కు సంబంధించిన మేకింగ్‌ వీడియోతో పాటు ప్రభాస్‌, అరుణ్‌ విజయ్‌, హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌లను కూడా ఈ వీడియోలో చూపించారు.

ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేష్, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ నిర్మిస్తున్న ఈ సినిమాకు రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు