షేడ్స్‌ ఆఫ్‌ తమన్నా

26 Nov, 2017 00:25 IST|Sakshi

మూతి 36 వంకరలు తిరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. ఎవరైనా అమ్మాయి ముఖాన్ని అదోలా పెడితే... ‘మూతిని 36 వంకరలు తిప్పుతుందండీ బాబూ!’ అంటుంటారు. మరి, ఎప్పుడు ఏ వంకర పెడితే బాగుంటుంది? తమన్నా టిప్స్‌ ఇచ్చారండోయ్‌! 36 వంకరలు కాదు గానీ... జస్ట్, ఓ ఐదు వంకరలు తిప్పారు. పాతకాలం సామెత తమన్నాకు తెలుసో? లేదో? కానీ... కొత్తకాలంలో ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా యువత (అనుకోవాలేమో!) తమకు ఎదురయ్యే సందర్భాల్లో ఏయే వంకరలు తిప్పితే బాగుంటుందనేది చూపించారు. తమన్నాలో షేడ్స్‌ని అందరూ చూడండి!!

జనాలు స్పీడుగా, ఏదో పిచ్చి పట్టినట్టు పరుగుల మీద వెళ్లినా సరే... సేమ్‌ రెడ్‌ లైట్‌ (సిగ్నల్‌) దగ్గర మనతో పాటు ఆగాల్సిందే! అటువంటి సంఘటన ఎదురైనప్పుడు తమన్నా ఇటువంటి లుక్‌ ఇస్తారట!
లాంగ్‌ వీకెండ్‌ వస్తుందని మీరు ఊహించినప్పుడు... ఒక్కసారి మీరు వేసుకున్న బట్టలు చూసుకోండి! అప్పుడు పెదాలు ఇలా విచ్చుకుంటాయట!

మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది. అప్పుడు... ‘జస్ట్‌ పౌట్‌’ అంటున్నారు తమన్నా! (పౌట్‌ అంటే... మూతిని సున్నాలా చుట్టడమే! సెల్ఫీలు తీసుకునేటప్పుడు పౌట్‌ చేయడమంటే అమ్మాయిలకు ఎంతో ఇష్టమని పలు సర్వేలు స్పష్టం చేశాయి).

రేపు సోమవారం అని అర్థమైనప్పుడు? చిరునవ్వు మాయం!!
ఆదివారం బిర్యానీ ఉంటుందని (ఇంట్లో!) ఊహించారు. కానీ, పప్పన్నం ఉందని తెలిస్తే... అప్పుడు తమన్నా ఎక్స్‌ప్రెషన్‌ ఇదిగో ఇలా ఉంటుందట!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు