‘సాహో’ అప్‌డేట్‌.. ప్రభాస్‌ అభిమానులకు పండుగే!

22 Oct, 2018 16:26 IST|Sakshi

బాహుబలి సిరీస్‌తో ఇండియన్‌ స్టార్‌గా ఎదిగాడు ప్రభాస్‌. ఇక ప్రభాస్‌ తదుపరి ప్రాజెక్ట్‌పై ఇండియా వైడ్‌గా క్రేజ్‌ ఏర్పడింది. అందుకే ‘సాహో’ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ను ప్రకటించారు మేకర్స్‌. 

రేపు (అక్టోబర్‌ 23) ప్రభాస్‌ పుట్టినరోజు కానుకగా.. షేడ్స్‌ ఆఫ్‌ సాహో అంటూ ప్రభాస్‌ పాత్రకు సంబంధించిన సిరీస్‌ను రివీల్‌ చేయనున్నట్లు ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటలకు వీటిని రిలీజ్‌ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. యూవీ క్రియేషన్స్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుజిత్‌ దర్శకత్వం వహించగా, బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 

మరిన్ని వార్తలు