సన్నీ కోరిక తీర్చిన షారుక్!

27 Mar, 2016 23:05 IST|Sakshi
సన్నీ కోరిక తీర్చిన షారుక్!

 సన్నీ లియోన్ బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఏకంగా బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌తో కాలు కదిపే అవకాశం దక్కించేసుకున్నారు. ఐటమ్ సాంగ్స్, హాట్ క్యారెక్టర్స్ చేస్తూ దూసుకెళుతున్న సన్నీకి షారుక్‌తో నటించాలనే కల ఎప్పట్నుంచో ఉంది. అయితే, గతంలో ఆమె నీలి చిత్రాల్లో నటించినందున సన్నీని మెయిన్ స్ట్రీమ్ నాయికగా చూడ్డానికి బాలీవుడ్‌లో చాలామంది ఇష్టపడటంలేదు. అంతెందుకు... స్టార్ హీరోల భార్యలు తమ భర్త సన్నీతో నటించడానికి ససేమిరా అంటున్నారు. ఇప్పుడా పరిస్థితిలో మార్పొచ్చింది. సన్నీకి బాలీవుడ్ ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇటీవల ఆమిర్‌ఖాన్ కూడా సన్నీతో నటించడానికి తనకేం అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు షారుక్ ఖాన్ తన తాజా చిత్రం ‘రాయీస్’లో సన్నీకి ప్రత్యేక గీతంలో నర్తించే అవకాశమిచ్చారు.

ఈ సందర్భంగా సన్నీ లియోన్ మాట్లాడుతూ - ‘‘ఇదో కలలా ఉంది. అందుకే ఈ సినిమాకి అవకాశం వచ్చినప్పుడు నన్ను నేను గిల్లి చూసుకున్నా. ఈ అవకాశం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా. షారుక్ సరసన చేసే అదృష్టం కోసం ఆ దైవాన్ని ప్రార్థించాను. ఇంత కాలానికి నా కోరిక తీరింది’’ అని ఉద్వేగంగా అన్నారు. 1980లో జీనత్ అమన్  నర్తించిన ‘ఖుర్బానీ’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘లైలా ఓ లైలా...’ పాటను ‘రాయీస్’ చిత్రం కోసం రీమిక్స్ చేయనున్నారు. ఈ పాటకే షారుక్ ఖాన్‌తో సన్నీ కాలు కదపనున్నారు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి