పంజాబ్‌ టు కెనడా

8 Jul, 2020 00:08 IST|Sakshi

దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ తర్వాతి చిత్రంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ‘జీరో’ చిత్రం తర్వాత షారుక్‌ మరో సినిమాకు సైన్‌ చేయలేదు. ఈ నేపథ్యంలో రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించే చిత్రానికి రంగం సిద్ధమైందని బాలీవుడ్‌ టాక్‌. వాస్తవానికి వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందని గత ఏడాదే వార్తలు వచ్చాయి. కథ రెడీ అయ్యిందని, హిరాణీ అండ్‌ టీమ్‌ ప్రస్తుతం ఈ స్క్రిప్ట్‌కు ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చే పనిలో ఉన్నారని సమాచారం. ఇందులో సరదా సరదాగా ఉండే వ్యక్తి పాత్రలో షారుక్‌ నటించబోతున్నారట. ఇందుకోసం ప్రస్తుతం జుట్టు పెంచుతున్నారని భోగట్టా. పంజాబ్‌ టు కెనడాల మధ్య ప్రయాణించే ఓ వ్యక్తి నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. ఎక్కువగా ఫారిన్‌ లొకేషన్స్‌లో షూటింగ్‌ను ప్లాన్‌ చేశారట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్‌ ఆరంభమయ్యే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా