లాస్‌ ఏంజెల్స్‌ వీధుల్లో కింగ్‌ ఖాన్‌

6 Dec, 2019 12:36 IST|Sakshi

లాస్‌ ఏంజెల్స్‌: బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌కు ఈ మధ్యకాలంలో సినిమాలు కలిసి రావడం లేదు. ‘జీరో’ సినిమా ప్లాప్‌ తర్వాత కింగ్‌ ఖాన్‌ ఇంత వరకు బిగ్‌ స్కీన్‌పై  కనిపించనే లేదు. దీంతో షారుక్‌ సినిమాలకు కాస్త విరామం​ ఇచ్చినట్లుగా బీ టౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విరామ సమాయంలో షారుక్‌ తన భార్య గౌరీ ఖాన్‌తో కలిసి అమెరికాలో సేదతీరుతున్నారు. ప్రస్తుతం షారుక్‌ లాస్‌ ఏంజెల్స్‌ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. లాస్‌ ఏంజెల్స్‌లోని ఓ స్విమ్మింగ్‌ పూల్‌ పక్కన కింగ్‌ ఖాన్‌​ లేజీగా కూర్చుని ఉన్న ఫొటోకు ‘ఆఖరికి లాస్‌  ఏంజెల్స్‌ సూర్యుడు వెళ్లిపోయాడు. ఇక ఇది పూల్‌ సమయం’ అనే క్యాప్షన్‌ను జత చేశాడు.  అలాగే ఈ పోస్టులో గోడకు ఆనుకుని ఉన్న బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో, అలాగే బిలియార్డ్‌ టేబుల్‌ దగ్గర ఉన్న ఫొటోలను ‘షారుక్‌ ఫ్యాన్స్‌ క్లబ్‌’ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేశాడు. 

అలాగే కింగ్‌ ఖాన్ నేవి బ్లూ జాకెట్‌ ధరించి అభిమానితో దిగిన ఫొటోను,  ఓ వీడియోలో అభిమానులు ఆయనను పిలుస్తుంటే తాను ఒంటరిగా ఉండాలనుకుంటున్నా అన్నట్లుగా రాను అంటూ సైగ చేస్తున్న వీడియోలను కూడా షేర్‌ చేశాడు. ఈ వీడియోలు, ఫొటోలను చూస్తుంటే లాస్‌ ఏంజెల్స్‌లో ఆయనకు మంచి విరామ సమయం​ దొరికినట్లుగా అనిపిస్తుంది. ఇక షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ ప్రస్తుతం యూకే యూనివర్శిటీలో ఫిలిం మేకింగ్‌ కోర్సు చేస్తుండగా, కూతురు సుహానా ఖాన్‌కు న్యూయార్క్‌ యూనివర్శిటీలో ఫిలిం స్టడీస్‌లో సీటు వచ్చిన విషయం తెలిసిందే. అందుకే కింగ్‌ ఖాన్‌ ఈ హాలిడేస్‌ను కూతురు, కొడుకుతో కలసి ఎంజాయ్‌ చేయడానికే లాస్‌ ఏంజెల్స్‌కు వెళ్లినట్లున్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా