సారే జహాసే అచ్చా

24 Oct, 2018 01:18 IST|Sakshi

‘జీరో’ తర్వాత రాకేశ్‌ శర్మ బయోపిక్‌లో షారుక్‌ ఖాన్‌ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘సారే జహాసే అచ్చా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. షారుక్‌ ముఖ్య పాత్రలో మహేశ్‌ మతాయి తెరకెక్కించనున్న స్పేస్‌ మూవీ ఇది. భూమి పెడ్నేకర్‌ హీరోయిన్‌గా ఎంపికయ్యారు.

సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్, రోనీ స్క్రూవాలా సంయుక్తంగా నిర్మించనున్నారు. వ్యోమగామి రాకేశ్‌ శర్మ పాత్రలో షారుక్‌ కనిపిస్తారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. 

మరిన్ని వార్తలు