జర్నలిస్ట్‌ షారుక్‌!

7 Jun, 2020 05:45 IST|Sakshi
షారుక్‌ఖాన్

హీరో మాధవన్‌ను ప్రశ్నించారు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌.. ఏం ప్రశ్నించారు? వాటికి మాధవన్‌  సమాధానాలు ఏమిటి? అనేవి వెండితెరపైనే తెలుసుకోవాలి. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌  జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో నంబి నారాయణన్‌  పాత్రలో నటించి, దర్శకత్వం వహించారు మాధవన్‌ . జర్నలిస్ట్‌గా కనిపించబోతున్నారు షారుక్‌ ఖాన్‌ . నంబి నారాయణన్‌ని ఓ జర్నలిస్ట్‌ ప్రశ్నలు అడిగే సన్నివేశంతో ‘రాకెట్రీ’ సినిమా మొదలై, ఆ తర్వాత ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌కి వెళుతుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌  పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. షారుక్‌ నటించిన గత చిత్రం ‘జీరో’లో మాధవన్‌  సైంటిస్ట్‌గా నటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు