స్పీడ్‌ పెరిగింది

15 Jul, 2019 00:32 IST|Sakshi
షారుక్‌ ఖాన్‌

షారుక్‌ ఖాన్‌ నిర్మాతగా ఫుల్‌ స్పీడ్‌లో ఉన్నారు. కానీ, హీరోగా చేసే కొత్త ప్రాజెక్ట్‌ను అంగీకరించడానికి మాత్రం టైమ్‌ తీసుకుంటున్నారు. ఆల్రెడీ ‘బార్డ్‌ ఆఫ్‌ బ్లడ్, క్లాస్‌ ఆఫ్‌ 83’ సినిమాలను నెట్‌ఫ్లిక్స్‌ కోసం నిర్మిస్తున్న ఆయన తాజాగా ఓ హారర్‌ సిరీస్‌కు సహ నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలిసింది. ‘బీతాల్‌’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సిరీస్‌లో వినీత్‌ కుమార్‌ సింగ్, ఆహనా కుమ్రా ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. రాధికా ఆప్టే ‘గౌల్‌’ సిరీస్‌ను డైరెక్ట్‌ చేసిన ప్యాట్రిక్‌ గ్రహం ఈ చిత్రానికి దర్శకుడు. త్వరలో షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. షారుక్‌ సినిమాల విషయానికి వస్తే అట్లీ దర్శకత్వంలో ఓ సినిమలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం.

మరిన్ని వార్తలు