మంటల్లో ఆమె.. కాపాడిన షారుఖ్‌!

30 Oct, 2019 15:15 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ మెగాస్టార్‌  అమితాబ్‌ బచ్చన్‌ రెండేళ్ల విరామం తర్వాత ఆదివారం తన నివాసంలో నిర్వహించిన దీపావళి వేడుకలకు సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరైన సంగతి తెలిసిందే. అయితే, ఈ వేడుకల్లో ఒక అపశ్రుతి చోటుచేసుకున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. దీపాలతో ముస్తాబైన బిగ్‌బీ నివాసం జల్సాలో ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ మేనేజర్‌ అర్చన సదానంద లెహెంగాకు అనుకోకుండా నిప్పంటుకుంది. దీనిని గుర్తించిన షారుఖ్‌ ఖాన్‌ వెంటనే స్పందించి.. ఆమెకు పెద్దప్రమాదం కాకుండా కాపాడారు.  ఐశ్వర్యకు అర్చన సదానంద్‌కు చాలా కాలంగా మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. పార్టీలో ఆమె లెహంగాకు దీపం అంటుకుంది. ఈ  ప్రమాదాన్ని గుర్తించిన షారుక్‌ ఖాన్‌ వెంటనే తన జాకెట్‌తో ఆమె లెహెంగాకు అంటుకున్నమంటలను ఆర్పాడు.

ఈ ప్రమాదంలో అర్చనకు చేతులకు, కుడి కాలికు 15శాతం గాయాలయ్యాయి. షారుక్‌కు కూడా స్వల్ఫ గాయాలయ్యాయి. ఎటువంటి ఇన్ఫెక‌్షన్లు దారి చేరకుండా ఉండేందుకు ఆమెను ఐసీయూలో ఉంచారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. సోమవారం తెల్లవారుజామున 3గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో బిగ్‌ బీ ఇంట్లో అతికొద్ది గెస్ట్‌లు మాత్రమే ఉన్నారు. పార్టీ సుమారుగా ముగియడంతో మేనేజర్‌ అర్చన తన కుమార్తెతో కలిసి బయట ప్రాంగణంలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంతో పార్టీలోని వారు ఒక్కసారి షాక్‌కు గురయ్యారు. అయితే, అక్కడే ఉన్న షారుఖ్‌ రియల్‌ హీరోగా స్పందించి అర్చనను కాపాడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హాలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు మృతి

డబుల్‌ సెంచరీ కొట్టిన బిగిల్‌

ఆ రోజు నుంచి ‘బిగ్‌బాస్‌’ కనిపించదు..

5 రోజుల్లోనే రూ. 111 కోట్ల కలెక్షన్లు

హీరోయిన్‌ కొత్త ప్రతిపాదన

బిగ్‌బాస్‌: గదిలో ఒంటరిగా ఏడుస్తున్న వరుణ్‌..

ఇస్మార్ట్‌ శంకర్‌ ‘రెడ్‌’ ప్రారంభం

ఏ చిక్నే: రణ్‌వీర్‌ సింగ్‌ కొత్త లుక్‌

షూటింగ్‌ ప్రారంభం: హ్యాట్రిక్‌పైనే గురి

రెండోసారి తండ్రి అయిన స్టార్‌ హీరో

'వివాహిత నటుడితో సహజీవనం చేశా'

బిగ్‌బాస్‌: శ్రీముఖి కల నెరవేరబోతుంది

100 కోట్ల క్లబ్‌లో బిగిల్‌

నాగబాబు బర్త్‌డే; మెగా ఫ్యామిలీలో సందడి

‘ఆ సినిమా కథ కాపీరైట్స్‌ నావే’ 

పాత్రలా మారిపోవాలని

ఇది మనందరి అదృష్టం 

ఫారిన్‌ ప్రయాణం

కొత్త తరహా కథ

ప్రేమ..వినోదం...

రణస్థలం హిట్‌ అవ్వాలి – పూరి జగన్నాథ్‌

దేవరకొండ ప్రేమకథ

కామెడీ గ్యాంగ్‌స్టర్‌

వారోత్సవం!

బన్నీకి విలన్‌

వారిద్దరి మధ్య ఏముంది?

నటి అ‍ర్చన పెళ్లి ముహూర్తం ఫిక్స్‌

కేజీఎఫ్‌ సంగీత దర్శకుడు సంచలన కామెంట్స్‌

వాళ్లే నా సోల్‌మేట్స్‌: హీరోయిన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హాలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు మృతి

ఆ రోజు నుంచి ‘బిగ్‌బాస్‌’ కనిపించదు..

మంటల్లో ఆమె.. కాపాడిన షారుఖ్‌!

5 రోజుల్లోనే రూ. 111 కోట్ల కలెక్షన్లు

బిగ్‌బాస్‌: గదిలో ఒంటరిగా ఏడుస్తున్న వరుణ్‌..

హీరోయిన్‌ కొత్త ప్రతిపాదన