అనుష్క, షారుఖ్‌, కత్రిన అదరగొట్టారు!

2 Nov, 2018 17:36 IST|Sakshi

కేవలం గ్లామర్‌ పాత్రలే కాకుండా.. నటనకు ఆస్కారమున్న పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు అనుష్క శర్మ. ఇప్పటికే సుల్తాన్‌, సూయీ ధాగా చిత్రాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు అనుష్క శర్మ. అయితే ప్రస్తుతం షారుఖ్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో ‘జీరో’ సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. 

మరగుజ్జు పాత్రలో షారుఖ్‌ నటిస్తుండగా, కుర్చీకే పరిమితమైన దివ్యాంగురాలిగా అనుష్క శర్మ నటిస్తున్నారు. ఈ చిత్రానికి వీరిద్దరి నటనే హైలెట్‌ కానున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో సెలబ్రెటీ పాత్రలో నటిస్తున్న కత్రినా కైఫ్‌ తన గ్లామర్‌తో అదరగొట్టేశారు. ప్రేమ, హాస్యం, భావోద్వేగాలతో మిళితమైన ఈ ట్రైలర్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రాబోతున్న ఈ చిత్రానికి ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వం వహించారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు