నా చివరి కోరిక ఇదే!

12 Sep, 2015 00:09 IST|Sakshi
నా చివరి కోరిక ఇదే!

హాలీవుడ్ సినిమాలను అమితంగా ఇష్టపడే షారుక్‌ఖాన్‌కు ‘మిషన్ ఇంపాజిబుల్’, ‘జేమ్స్ బాండ్’ సిరీస్‌లంటే చాలా ఇష్టం. ఈ సిరీస్ సినిమాలను ఆయన లెక్కలేనన్ని సార్లు వీక్షించారట! ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్ హీరో ఈథెన్ హంట్, జేమ్స్ బాండ్‌లు ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే చూడాలనేది షారుక్ చిరకాల వాంఛ. ఈ విషయమై షారుక్ మాట్లాడుతూ ‘‘నా సీక్రెట్ ఫాంటసీ ఏంటంటే... ఈ రెండు పాత్రలను ఒకే సినిమాలో చూడాలని ఉంది. అలాంటి సినిమా వస్తే నా ఆనందానికి హద్దే ఉండదు.

నా చివరి కోరిక కూడా ఇదే. ఎప్పటికైనా నెరవేరుతుందని అనుకుంటున్నాను’’ అని చెప్పారు. మరి ఆయన కోరిక తీరుతుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి.