మళ్లీ యోధుడిగా!

14 Jun, 2016 23:41 IST|Sakshi
మళ్లీ యోధుడిగా!

 వెండితెర అశోక చక్రవర్తిగా షారుక్‌ఖాన్ 15 ఏళ్ల క్రితమే  ‘అశోక’ అనే చిత్రంలో నటించి, అభిమానులను మెప్పించారు. ఆ తర్వాత ఆ జానర్‌ను టచ్ చేయలేదు. ఇప్పటివరకూ ఫ్యామిలీ, మాస్ ఎంటర్‌టైనర్స్, ‘రా వన్’ వంటి సైన్స్ ఫిక్షన్ మూవీస్ మీద దృష్టి సారించిన షారుక్ మరోసారి యోధుడిగా కనిపించడానికి సిద్ధమవుతున్నారు.
 
  యశ్‌రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. చారిత్రక కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రం స్క్రిప్ట్ కోసం దర్శక-నిర్మాత ఆదిత్యా చోప్రా మూడేళ్లుగా వర్క్ చేస్తున్నారట.  ‘‘వచ్చే ఏడాది చివరిలో షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. మూడు నెలల్లోపే పూర్తి చేసేస్తానని ఆదిత్య చెప్పారు. చిత్రీకరణ ప్రారంభించే రెండు మూడు నెలలు ముందే నా పాత్ర కోసం వర్కవుట్ మొదలు పెట్టాలి’’ అని షారుక్ అన్నారు.